పంజాబ్ అమృత్సర్లోని ప్రపంచ ప్రసిద్ధ స్వర్ణ దేవాలయం వద్ద మరోసారి బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ పేలుడులో ఆరుగురు గాయపడ్డారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, ఆదివారం కూడా గోల్డెన్ టెంపుల్ సమీపంలో బాంబు పేలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.