రేపల్లె ప్రాజెక్ట్ పరిదిలో భ్రట్టిపోలు మండలం అంగన్వాడీ హెల్పర్ కు ఐసిడిఎస్ అధికారులు ఇచ్చిన మెమో ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్లు ఉందని, హెల్పర్ పై ఒత్తిళ్లు ఆపాలని ఐసిడిఎస్ రేపల్లె ప్రాజెక్టు సిడిపిఓ ఎస్. మాణిక్యంకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మణిలాల్ మాట్లాడుతూ చిన్న ఉద్యోగులుగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ పై అధికారులు ఉద్దేశపూర్వకంగా సంబంధంలేని అంశాలపై మెమో ఇచ్చి వివరణ అడగటం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురువుతున్నారన్నారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ నిభందనలు ప్రకారం పనిచేస్తున్నవారి పై మెమోలు పేరుతో వెందింపులు చేయరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు కె. ఝాన్సి, సీఐటియూ భ్రట్టిప్రోలు మండలం కార్యదర్శి జీ. సుధాకర్ లు పాల్గొన్నారు.