గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన సోమవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం లాలుపురం గ్రామానికి చెందిన తోట పుల్లారావు తన ద్విచ క్రవాహనంపై విజయవాడవైపుగా హైవేలో వెళుతున్నారు. ఈ క్రమంలో వేగంగా నడుపు తుండగా ఎదురుగా విజయవాడవైపు వెళు తున్న కారును వెనుకనుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో పుల్లారావుకు గాయాలు కావటం తో స్థానికులు అతనిని 108లో జీజీహెచ్ కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు క్షతగాత్రుని పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.