గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మహిళ ఆత్మహత్యపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ముత్యాలరెడ్డినగర్ లో నివసించే గంగూరి శ్రీనివాసరావు భార్య అరుణ (44) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. కడుపు నొప్పి తాళ లేక సోమవారం ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు