ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై 'జియో' సర్వీసులను మాత్రమే వినియోగించాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వాడుతున్న వొడాఫోన్-ఐడియా సర్వీసులను నిలిపివేశామని, ఆ నెంబర్లను జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. గుజరాత్ ప్రభుత్వం, రిలయన్స్ ల మధ్య ఒప్పందం ప్రకారం జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా 4జీ సర్వీసులతో లభిస్తుంది. ఉద్యోగులకు రూ.37.50కే పోస్ట్ పెయిడ్ సేవలు అందిస్తామని జియో ప్రకటించింది.