కర్ణాటక అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఎలక్షన్ కమిషన్ తొలిసారిగా ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు ఇంటి నుండే ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 5.31 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.