పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల రేంజర్లు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టును నిరసిస్తూ పీటీఐ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పార్టీ మద్దతుదారులు పలు నగరాల్లో ఆందోళన చేపట్టగా హింసాత్మకంగా మారాయి. కొందర రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ లోకి చొచ్చుకెళ్లి దాడికి దిగారు. అలాగే లాహోర్ లోరి కార్ప్స్ కమాండర్ నివాసంలో ప్రవేశించి ఇంటిని ధ్వంసం చేశారు.