పదో తరతగతి జవాబుపత్రాల ముల్యాంకనం అనంతపురం కేఎ్‌సఆర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించారు. అయితే స్పాట్ డ్యూటీలో పనిచేసిన స్టాఫ్‌కు ఇచ్చే రెమ్యూనరేషనను పెంచుతూ అదే నెల 20వ తేదీ జీవో 37 విడుదల చేశారు. ప్రధానంగా స్పాట్‌లో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా పెంచారు. ఒకరికి రూ.193 పెంచితే, మరొకరికి రూ.165, ఇంకొకరికి రూ.143 పెంచారు. అదేవిధంగా పేపర్లు దిద్దడానికి గతంలో రూ.6.60 ఇస్తే, ఏకంగా రూ.10 ఇస్తామని ప్రకటించారు. విద్యాశాఖ రేట్లు పెంచడంతో అందరూ ఆనందించారు. అయితే పెంచిన రేట్ల మేరకు బడ్జెట్ రాలేదని, పాత రేట్లకే బడ్జెట్ వచ్చిందని,వాటినే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.