టీడీపీ పాలనలో పంచాయతీ రాజ్ కాలనీ పరిధిలో అప్పటి కౌన్సిల్ సమావేశంలో ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు తీర్మానించారని, ఉన్నట్టుండి ఆ పార్కుకు యర్రా నాగేశ్వరరావు పేరు పెట్ట డం అర్థరహితమని, ఇక కౌన్సిల్ తీర్మానాలకు విలువ ఏముంటుందని టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరా ము ధ్వజమెత్తారు. మంగళవారం మచిలీపట్నం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మో కా వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. కౌ న్సిల్లో 46వ సచివాలయం పరిధిలోని పార్కుకు యర్రా నాగేశ్వరరావు పేరు పెడుతూ ప్రవేశపట్టాన తీర్మానంపై వాగ్వాదం జరిగింది. 2019 నవంబరులో పంచాయతీ రాజ్ కాలనీలోని పార్కుకు దివంగత సీఎం ఎన్టీఆర్ పే రు పెట్టేందుకు తీర్మానించారన్నారు. ఇప్పుడా తీర్మానా న్ని తోసిపుచ్చి యర్రా నాగేశ్వరరావు పేరు ప్టెటడం సబ బు కాదని చిత్తజల్లు నాగరాజు ధ్వజమెత్తారు. వైసీపీ కార్పొరేట ర్ మేకల సుబ్బన్న, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబుకు చిత్తజల్లు నాగరాముకు మధ్య తీవ్ర వా గ్వాదం జరిగింది. పార్కు అభివృద్ధికి రూ.10లక్షలు విరా ళం ఇచ్చినందున యర్రా నాగేశ్వరరావు పేరు పెట్టామన్నారు. సమావేశంలో 7వ డివిజన్ సచివాలయం వద్ద రోడ్డు వెడల్పు చేసేందుకు, డ్రైన్ నిర్మించేందుకు రూ. 4. 41 లక్షలు మంజూరు చేశారు. 33వ డివిజన్‌లో ఇమాం మసీదు బరియల్ గ్రౌండ్‌కు కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు రూ. 4.94 లక్షలు నిధులు మంజూరు చేశారు.