జమ్మలమడుగు పరిధిలోని ఎర్రగుంట్ల పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన మల్లెపోగు ప్రసాద్, అంబేద్కర్‌నగర్‌కు చెందిన దండు నరసింహులు, ప్రకాశ్‌నగర్‌కు చెందిన చరణ్‌కుమార్, మైలవరం మండలం మబ్బుసానిపల్లెకు చెందిన పుల్లారెడ్డి జల్సాలకు అలవాటు పడ్డారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం సీసీ కెమెరాలు లేని ప్రదేశాల్లో పార్కింగ్ చేసి ఉంచిన మోటరు సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ తాళాలతో చోరీలకు పాల్పడేవారు. ఈ బైకులను ఇతర ప్రాంతాల్లో అమ్ముకుంటూ.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకునేవారు. ఇలా గత ఆరు నెలల్లో 25 మోటరు సైకిళ్లను చోరీ చేశారు. కడప, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో యర్రగుంట్ల టౌన్ సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద నలుగురు చోరీ చేసిన బైకులతో పారిపోతుండగా జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల అర్బన్ సీఐ మంజునాధరెడ్డి, ఎస్‌ఐలు క్రిష్ణయ్య, ప్రవీణ్‌కుమార్ సిబ్బందితో దాడిచేసి అరెస్టు చేశారన్నారు. వీరి వద్ద నుంచి 21 బైకులను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులను రిమాండుకు తరలించినట్లు తెలిపారు. నలుగురు అంతరాష్ట్ర బైకు దొంగలను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.