‘‘జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేడు. పంటలు ఎలా పండిస్తారో ఆయనకు తెలియదు’’ అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారన్నారు. ‘‘సీడ్ బకాయి, ధాన్యం కొనుగోళ్ల బకాయిలు కలిపి సుమారు రూ.5,000 కోట్లు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను చూసి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. వ్యవసాయం గురించి మాకు పూర్తిగా తెలుసు. వారికే ఏమీ తెలియదు’’ అని మంత్రి కాకాణి అన్నారు.