మహనీయుడు కాన్షీరాంను సీఎం జగనతో పోల్చడం వైసీపీ మంత్రి మేరుగు నాగార్జునకు తగదని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందెల గౌతమ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...... వైసీపీ మంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో కాన్షీరాం కంటే గొప్పగా సీఎం జగన పని చేస్తున్నారని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మహాపురుషులైన కాన్షీరాంతో జగనను పోల్చడం మంత్రి అవివేకమన్నారు. ప్రస్తుత కాలంలో సంఘ సంస్కర్తలను ప్రజా ప్రతినిధుల తో పోల్చడం పరిపాటైందన్నారు. ఎస్సీ కార్పొరేషనకు ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేశారో సీఎం చెప్పాలన్నారు. మదనపల్లెకు జిల్లా లేదు, రైల్వే లైనలేదు, మదనపల్లె- కడప పోర్వే లైనలేదు, హంద్రీనీవా, గాలేరు నగరి పనులు పూర్లి చేయలేదని మండిపడ్డారు. సమావేశంలో నేతలు బాటాజీ, శ్రీనాథ్, లక్ష్మీపతి, శివ, మహేష్ పాల్గొన్నారు.