జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు 13వ తేదీన ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు, న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్, జిల్లా ప్రధాన జడ్జి వి.శ్రీనివాస అంజనేయమూర్తి తెలిపారు. ఉదయం 10-30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. లోక్ అదాలత్‌లో కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు. ఇక్కడ ఒకసారి కేసు పరిష్కారమైతే సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు. అప్పీల్‌కు వెళ్లడానికి వీలుపడదన్నారు. పైగా సమయం, డబ్బు అదా అవుతుందన్నారు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన లోక్ అదాలత్‌ను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.