హిందూ సంప్రదాయం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు, గోళ్లు కొన్ని ప్రత్యేక రోజుల్లోనే కత్తిరించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. బుధవారం వీటిని కత్తిరించుకుంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందని, ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగుతాయని చెబుతున్నారు. ఆది, సోమ, మంగళ, గురు, శనివారాల్లో జుట్టు, గోళ్లు కత్తిరిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. వీటిని కత్తిరించిన వెంటనే స్నానం చెయ్యాలంటున్నారు.