ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నావ్‌కి చెందిన అమ్మాయి (17), తక్కువ కులానికి చెందిన యువకుడు(19) ప్రేమించుకున్నారు. ఇది తెలిసి ఆగ్రహించిన అమ్మాయి కుటుంబీకులు యువకుడిని కిడ్నాప్ చేసి మామిడి తోటలో నరికేశారు. అనంతరం అమ్మాయిని కూడా చంపి అక్కడే పడేశారు. ఇద్దరినీ మామిడి చెట్టుకు వేళాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించారని పోలీసులు తెలిపారు.