ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 - 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, గురువారం అత్యధికంగా శెట్టూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 60 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.