ఏలూరు, తణుకు-ఇరగవరం రహదారిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తడిచిన ధాన్యం రహదారిపై పెట్టి చంద్రబాబుకు చూపించేందుకు రైతులు వచ్చారు. రైతుల్ని పోలీసులు అడ్డుకొని సెల్ ఫోన్ లాక్కోవడంతో ఎమ్మెల్యే రామానాయుడు నిలదీశారు. నేమ్ ప్లేట్లు లేకుండా.. సివిల్ డ్రెస్సులో పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు. చంద్రబాబుకు బాధలు చెప్పుకుందాం అని వచ్చే రైతుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారని రామానాయుడు నిలదీశారు.