టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నేడు కర్నూలు జిల్లా బన్నూరు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో జగన్ రెడ్డి తుగ్లక్ పాలనలో ఈ తల్లి ఒక బాధితురాలు. ఈమె పేరు చిన్నక్క. నందికొట్కూరు నియోజకవర్గం తుమ్ములూరుకు చెందిన ఈమెకు 10నెలల క్రితం పెన్షన్ తీసేశారు. కారణమేంటని అడిగితే ఎక్కడో తెలంగాణాలో ఉంటున్న కొడుక్కు కారు ఉందట, బిడ్డకు ఫోర్ వీలర్ ఉంది కాబట్టి తల్లికి పెన్షన్ పీకేశారు. ఫిటింగ్ మాస్టర్ జగన్ కు ఈ సందర్భంగా నాదో సూటి ప్రశ్న. బాత్రూమ్ లో బాబాయిని లేపేసిన కేసులో రేపో,మాపో నీ ముద్దుల తమ్ముడు జైలుకు పోతాడు, అందుకు కారణం నువ్వే కాబట్టి సిఎం పదవి వదిలేసి జైలుకి పోతావా తుగ్లక్ రెడ్డీ?!’’ అని ప్రశ్నించారు.