తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి ఆనంద నిలయాన్ని అతిసమీపం నుంచి విడియో తీసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందింది. ఆదివారం అర్ధరాత్రి కెమెరాలో చిత్రీకరించిన విడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కరీంనగర్ సమీపంలోని శేషపట్నానికి చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అతన్ని తిరుమలకు తీసుకువచ్చి ఏ కెమెరాతో వీడియో తీశాడు, తనిఖీలను దాటి ఎలా ఆలయంలోకి ప్రవేశించాడు, వీడియో తీయడానికి ప్రధాన కారణాలు ఏమిటనే అంశాలపై దర్యాప్తు పూర్తిచేసి అరెస్టు చూపనున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa