పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన లోకనాథం ప్రతాపరాజు (48) విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. తాడేపల్లిగూడెంలో ఉంటున్న అతని తండ్రి రాజేశ్వరరావు గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. గురువారం ఉదయం భార్య, ఇతర కుటుంబ సభ్యులను విశాఖలో రైలు ఎక్కించిన ప్రతాపరాజు. కుమారుడు సుధీర్‌కుమార్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై తాడేపల్లిగూడెం బయలుదేరారు. అయితే నక్కపల్లి వారపుసంత హైవే పాయింట్ వద్ద వాహనం అదుపుతప్పి ప్రతాపరాజుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. సుధీర్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.