అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాల అంచనాలో క్షేత్రస్థాయి అధికారులు ఉదారత చూపాలని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులను కోరారు. లబ్ధిదారుల జాబితాలను సోషల్ ఆడిట్ నిర్వహించడం వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పెట్టుబడి రాయితీ అందించే వీలుంటుందన్నారు. గురువారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో పంట నష్టాలపై ఆయన సమీక్షించారు. ఖరీఫ్ రాయితీ విత్తనాల పంపిణీని జూన్ నుంచి చేపట్టాలని ఆదేశించారు. ఆర్బీకేల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు బయట మార్కెట్ కన్నా తక్కువగా ఉండాలని, వ్యాపారంగా కాకుండా రైతు సేవగా ఉండాలని మంత్రి సూచించారు.