అనంతపురం జిల్లా రాయదుర్గంలో వివాహిత వేధింపులకు యువకుడు బలయ్యాడు. కుత్తీష్(30) గతంలో ఓ వివాహితతో చనువుగా ఉండేవాడు. అప్పటి ఫోటోలు, ఫోన్ రికార్డింగ్‌లతో ఇప్పుడు వేధింపులకు గురిచేస్తుందని కుత్తీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ కూడా ఇతనిపై ఫిర్యాదు చేసింది. ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్న క్రమంలో వివాహిత యువకుడిపై మరింతగా వేధింపులకు గురిచేసింది. దీంతో కుత్తీష్ ఉరేసుకుని చనిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa