సీఐడీ ఆదేశాల మేరకు అమరావతిలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న కట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని అతిథి గృహాన్ని ప్రభుత్వం అటాచ్ చేసింది. దీనికి సంబంధించి జప్తు నోటీసులు పంపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు అక్కడ ఏమి జరగకుండా నోటీసులు ఇచ్చారు అని ప్రశ్నించారు. లోపలి రోడ్డుపై మట్టి వేయలేదని, అలాంటప్పుడు అక్కడ చేసిన నేరం ఏంటని నిలదీశారు. నిజానికి ఆ నివాసానికి ఇచ్చిన జప్తు నోటీసులతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని వర్ల రామయ్య స్పష్టం చేశారు.ఈ అబద్ధాల ప్రభుత్వ మాటలు నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధ్యేయంగా ఇలాంటి పనులు చేస్తోందని, చంద్రబాబును అవినీతిపరుడిగా చిత్రీకరించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.