కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని NTA-AICTEలో 46 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. LDC, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టులను బట్టి డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్హత ఉండాలి. మే 5లోపు దరఖాస్తు చేసుకోవాలి. జీతం రూ.19900 నుంచి రూ.63200 వరకు లభించనుంది. పూర్తి వివరాలకు recruitment.nta.nic.in వెబ్సైట్ సందర్శించగలరు.