తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఆదివారం తెలంగాణలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్ లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఏపీలో గరిష్టంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.