టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ.. దినేశ్ కార్తీక్‌లు ఓ చెత్త రికార్డ్ కోసం పోటీపడుతున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎక్కువ సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన వారిలో వీరిద్దరే నం.1 పొజిషన్‌లో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 16 సార్లు డకౌట్లు అయ్యారు. వీరి తరువాత 15 డకౌట్లతో మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్‌లు ఉన్నారు. కాగా ఈ సీజన్‌లో రోహిత్, కార్తీక్ పేలవ ప్రదన్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నారు.