వెంకటాపురం ప్రీమియర్ లీగ్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలమూరు సంజీవకుమార్ నాయుడు జ్ఞాపకార్థం 14వ వార్డు కౌన్సిలర్ ఆలమూరు విజయ్ కుమార్ నాయుడు, రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. వెంకటాపురం విజయ్ గార్డెన్ వద్ద జరిగే ఈ క్రికెట్లో మొదటి స్థానాలలో నిలిచిన జట్లకు రూ. 40116, రూ. 20116, రూ. 10116 నగదు బహుమతులు ఇస్తామన్నారు.