ముత్తుకూరు విలేజ్ హెల్త్ క్లినిక్ లో సోమవారం వైద్య శిబిరం నిర్వహిస్తామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అమీదా బేగం తెలిపారు. ఫ్యామిలీ కాన్సెప్ట్ విధానంలో ఈ వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఒక కుటుంబంలోని సభ్యులందరికీ వైద్య సేవలు అందించడమే ఈ విధానం ప్రత్యేకత అని చెప్పారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.