రాష్ట్ర బీసీ కమిటీ అధ్యక్షులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీల అభివృద్ధి కోసం శనివారం నిర్వహించిన సమావేశంకు శ్రీకాకుళం జిల్లా నుండి హాజరైన రాష్ట్ర సాధికారిక కమిటీ (గాండ్ల-తెలికుల) సభ్యులు కొమనాపల్లి వెంకట రామ రాజు పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్ర బీసీ గాండ్ల-తెలికుల సాధికారిక కమిటీ కన్వీనర్ శ్రీమతి గాండ్ల విశాలాక్షి గారి నేతృత్వం లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ల అభ్యున్నతి కోసం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బీసీ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని ప్రస్తుత ప్రభుత్వం లో బీసీ లు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని, బీసీల అభివృధ్ధికోసం అందరూ కృషి చేయాలని సమావేశం లో నిర్ణయించినట్లు తెలియజేసారు.
ఈ కార్యక్రమం అనంతరం గాండ్ల-తెలికుల సాధికారిక కమిటీ సభ్యులంతా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని కలిసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ సామాజిక వర్గం తప్పక కృషి చేస్తుందని రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షి గారు తెలిపినట్లు కొమనాపల్లి వెంకట రామరాజు పేర్కొన్నారు.