ప్రమాదం గురించి పుదుచ్చేరి ముఖ్యమంత్రికి నేను చెప్పగా మృతుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ప్రకటించారు. ప్రభుత్వంతో పాటు కంపెనీ, బస్సు ప్రతినిధులతో మాట్లాడి మరింత సాయం అందేలా చర్యలు తీసుకుంటా. నా తరఫున మృతుల ఒక్కో కుటుంబానికి రూ. లక్ష, విషమంగా ఉన్న ఇద్దరు క్షతగాత్రులకు చెరో లక్ష, గాయపడ్డ వారికి ఒక్కొక్కరికీ రూ. 25 వేలు చొప్పున అందజేస్తా. రెవెన్యూ, ఫిషరీస్ శాఖల నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం వచ్చేలా కృషి చేస్తా. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచీ డబ్బు వచ్చేలా ప్రయత్నం చేస్తా.