సీఎం జగన్ ఈ నెల 24న కొవ్వూరులో పర్యటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ 24వ తేదీ జరగనున్న వలంటీర్లకు వందనం సభలో ఆయన పాల్గొంటారన్నారు. ఈ సభ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గత నెల 14న అంబేడ్కర్ జయంతి రోజున సభ జరగాల్సి ఉండగా ఆకస్మికంగా వాయిదా వేశారు. మళ్లీ 25వ తేదీన జరగాల్సి ఉండగా అప్పుడు కూడా మరోసారి వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa