మంగళవారం రాత్రి నంద్యాల మండలం, కొత్తపల్లి దగ్గర యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి , అఖిల ప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడిచేశారు. ఈ ఘటనలో సుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిలప్రియపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa