స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 371 పాయింట్లు నష్టపోయి 61,560 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 18,181 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు రోజులుగా మార్కెట్ నష్టాలకు ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు తగ్గి 82.38 వద్దకు చేరుకుంది.