ఓ లారీ బ్రేక్డౌన్ నడిరోడ్డుపై నిలిచిపోయింది. తాజాగా ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి రోడ్డు మార్గంలో రూ.535 కోట్లను విల్లుపురం తరలిస్తుండగా ఒక్కసారిగా లారీ ఆగిపోయింది. అయితే ట్రక్కులో నగదు ఉందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.