తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు భగ్గునమంటున్నాయి. మండేఎండలు, వేడి గాలులకు భయపడి ప్రజలు ఇళ్ల నుంచి రావడానికే భయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలో ఇద్దరు వడదెబ్బతో చనిపోయారు. కొద్దిరోజులుగా దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయితే రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మే 31 వరకు ఈ 2 వారాలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరం ఉంటేనే బయటకి రావాలని లేదంటే ఇండ్లలోనే ఉండలాని సూచించారు.