దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంతో 61,872 దగ్గర, నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 18,269 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 82.35 వద్ద ప్రారంభమైంది. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ITC, HDFC, అల్ట్రాటెక్ సిమెంట్స్, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.