బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్లో మామిడి కొనుగోళ్లు బుధవారం ప్రారంభమైయ్యాయి. మార్కెట్ యార్డులో 110 మామిడి మండీలు ఉండగా, 30 మండీల్లో మామిడి మార్కెట్ యార్డుకు వచ్చిన మామిడికి మండీ యజమానులు విక్రయాలు ప్రారంభించారు. పలమనేరు మిట్టప్రాంతమైన నంగిలి, ముళ్ బాగల్, మాలూరు, కోలార్ తదితర ప్రాంతాల నుండి పక్వానికి వచ్చిన బేర్నిషా, పులేరా నాటు రకాలను రైతులు మార్కెట్ కు తరలించగా, బేర్నిషా టన్ను వేలు నుంచి రూ. 25 వేల వరకు ధరపలికింది. అలాగే పులేరా టన్ను రూ. 15 వేల నుంచి రూ. 18 వేల వరకు నాణ్యత, పరిమాణాల బట్టి ధర పలుకుతోంది. నాటు రకాలు రూ. 6 వేల నుంచి రూ. 8వేల వరకు ధరలు పలికాయి.