హజ్ యాత్రికులపై అదనపు భారం పడకుండా ఆదుకుని అండగా నిలిచిన సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్లాజమ్ అధ్యక్షతన విజయవాడలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ గౌస్లాజమ్ మాట్లాడుతూ.... హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే 1,813 మందిపై దాదాపు రూ.83 వేల వంతున అదనపు భారం పడుతుందని సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించారని చెప్పారు.