సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కొలేక.. టీడీపీ గజ్జి కుక్కలను పార్టీ ఆఫీస్ లో కూర్చోపెట్టి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీలో మరొక గజ్జికుక్కతో సీఎంగారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో రెండు లక్షలకు పైగా కోట్లు నేరుగా డిబిటి ద్వారా బదిలీ చేసిన సీఎంగారిని డైరెక్ట్‌గా ఎదుర్కోలేక, ఈ విధంగా అడ్డమైన వారితో అడ్డగోలు విమర్శలు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు.