రాజధాని అమరావతిలో పేదలు వద్దు అంటున్న తెలుగుదేశం పార్టీ,ఆ పార్టీ నేతలు రేపు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో చెప్పాలని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పేదలకు స్థలాలు ఇస్తుంటే అడ్డుకోవడం అన్యాయమైన చర్య అని అలాంటి ఆలోచన ఎవరికి రాకూడదు. ఇది దుర్మార్గమైన ఆలోచన ఇలాంటి ఆలోచనలు ఎవరికి రాకూడదు. దుర్మార్గమైన ఆలోచన టిడిపి అండ్ కో కి వచ్చింది. సుప్రీం కోర్టుకు పోవడం బరితెగింపునకు నిదర్శనమని తెలియచేశారు. ప్రభుత్వానికి ఉన్న ల్యాండ్ ఎవరికి ఇవ్వాలని ప్రభుత్వం ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ భూమి అయిన తరువాత అవసరాన్ని బట్టి దానిని వాడుతుంది. ఎవరిపైనా కక్షతో చేసింది కాదు...రాజధానిలో అందరూ ఉండాలని చేశామని తెలియచేశారు. ప్రతిపక్షాల తీరు చాలా అన్యాయంగా ఉందన్నారు.ఒక రాజకీయపార్టీగా తెలుగుదేశం పార్టీ తన అర్హత కోల్పోయిందన్నారు. ఆర్ -5 జోన్ విషయంలో చూస్తే దీనిని ప్రతిపక్షాలు ఒక వివాదంగా మార్చడం దారుణంగా ఉంది. గుడిలో లింగాన్ని,మట్టిని అన్నింటిని మింగేయాలని చంద్రబాబు భావించారు. ఆర్ 5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మాకు సంతోషాన్ని ఇచ్చాయన్నారు.