ఈ నెల 19వ తేదీ గ్రామ, వార్డు వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తోంది. ఎల్లుండి (19.05.2023) సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఉత్తమ వలంటీర్లను సత్కరించనున్నారు.