పలమనేర్ పట్టణంలో సెల్ఫోన్ దొంగతనాలు చేసే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పలమనేర్ డి. ఎస్. పి సుధాకర్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా గురువారం పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పలమనేర్ టౌన్ జండా మఠముకు చెందిన బలరాం కుమారుడు సూరిబాబు, పాతపేట లక్ష్మీ నగర్ కాలనీ చెందిన మనీ కుమారుడు యశ్వంత్ సాయి, అదే ప్రాంతానికి చెందిన హైదర్ వలీ కుమారుడు యూసఫ్, ముగ్గురు కలిసి కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నట్లు సమాచారం ఉందని వివరించారు. ఈనెల 14వ తేదీ పలమనేరు పట్టణములో గంగమ్మ జాతర సందర్భంగా సెల్ ఫోన్లు దొంగతనం జరిగిందని కొంతమంది బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా చిత్తూరు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రిశాంత్ రెడ్డి ఉత్తర్వులు మేరకు ఎస్ డి పి ఓ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై సుబ్బారెడ్డి క్రైమ్ సిబ్బందిని టీం గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఇంతకు మునుపు సెల్ఫోన్ దొంగతనం కేసులో పట్టుబడిన బలరాం కుమారుడు సూరిబాబు ఇంట్లో తనిఖీ చేయగా ఇంట్లో 108 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశామన్నారు. మీరు ముగ్గురు బంగారుపాలెం సోమల, బైరెడ్డిపల్లి చౌడేపల్లి పుత్తూరు తిరుపతి నెల్లూరు కడప క్రిష్ణగిరి ధర్మపురి కంచి చెన్నై తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లుగా విచారణలో ఒప్పుకున్నారన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐలు దేవరాజు రెడ్డి, శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, వేణుగోపాల్ అల్లావుద్దీన్ ప్రకాష్ నాయుడు అశోక్, బాలాజీ శశిధర్ లకు రివార్డ్ అందించడానికి ఎస్పీ కి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. ఈ కేసును చేదించిన కింది స్థాయి సిబ్బందికి డీఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.