చిత్తూరు జిల్లాలో పండే మామిడి టేబుల్ వెరైటీలకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ఎస్. షన్మోహన్ పేర్కొన్నారు.గురువారం జిల్లా సచివాలయం లోని సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్, మామిడి రైతులతో మరియు పల్ప్ ఇండస్ట్రీయజమానులతో సమావేశమై జిల్లా లో పండే మామిడి టేబుల్ వెరైటీల కు గల మార్కెటింగ్ సౌకర్యాలపై చర్చించినారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తోతాపూరి తో పాటు పండే మామిడి టేబుల్ వెరైటీలు అయినా బంగనపల్లి, ఇమామ్ పసంద్, లాల్ బహర్, మల్లిక, కాలేపాడు, కేసర్, చెరకు రసం తదితర వెరైటీలు పండించే రైతులకుఅవసరమైన మార్కెటింగ్ సదు పాయము నకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో పండే పలు వెరైటీలకు మన రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా మంచి గిరాకీ ఉన్నట్టు తెలిపారు.