ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆళ్ళగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయానిధి నుంచి లబ్ది పొందిన 8 మంది లబ్ధిదారులకు 19 లక్షల 40 వేల రూపాయల చెక్కులను ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్రా రెడ్డి పంపిణీ చేశారు. అనారోగ్యం కారణంగా తమ కుటుంబ పెద్ద మరణించడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాకు ఈ ఆర్థిక చేయూతతో కొండంత అండ లభిస్తుందని ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ ఫర్హానా ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అండగా నిలబడి పార్టీ, వర్గం అనేది చూడకుండా 2 లక్షల ఆర్థిక సహాయం అందేలా చేసిన ఎమ్మెల్యే గంగులకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఫర్హనా ఆనందభాష్పాల మధ్య తెలియజేశారు.