ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుండి రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలు ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణతో పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రల ఆధారంగా రేషన్ ఇస్తున్నామని, అయితే కూలీలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర వ్యాధిగ్రస్తులకు వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఐరిస్ యంత్రాలను ప్రవేశపెడుతున్నామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa