యూపీలోని బదాయూకి చెందిన యువకుడికి ఫిలిబిత్ కు చెందిన యువతితో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లైన రోజు నుంచే అమ్మాయిని దూరం పెట్టాడు. రూ.10 లక్షలు ఇస్తేనే హనీమూన్ తీసుకెళ్తానన్నాడు. అమ్మాయి వారు రూ.5 లక్షలు ఇవ్వగా హానీమూన్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. మిగతా రూ.5 లక్షలు ఇవ్వకుంటే నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.