ప్రధాని మోదీ నేటి నుండి ఆరు రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ముందుగా జపాన్ లో జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం ఈ నెల 22న పపువా న్యూగినియాలో భారత్- పసిఫిక్ దీవుల సహకార వేదిక సదస్సులో పాల్గొంటారు. ఆపై ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఆరు రోజుల పర్యటనలో ప్రధాని 40కి పైగా కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది.