రైల్వే కోడూరు మండలం సురపురాజు పల్లి, మాధవరం పొడు గ్రామ పంచాయతీల నందు మన "రాష్ట్రానికి ఇదేం కర్మ" అనే కార్యక్రమం రైల్వే కోడూరు ఇంచార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షలు కొమ్మా శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం ఆయా గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు. రచ్చబండ కార్యక్రమం పెట్టి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలు అన్నిటిని కూడా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.