సారవకోట మండలం మాళువ గ్రామానికి చెందిన వైసీపీ యువనేతలు గురువారం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. 20 మంది యువకులు పోలాకి మండలం కత్తిరివానిపేటలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగి టీడీపీలో చేరేందుకు నిర్ణయించామని తెలిపారు. గ్రామానికి వచ్చి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతామని బగ్గు రమణమూర్తి వారికి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మామిడి మోహనరావు, సురవరపు తిరుపతిరావు, మామిడి ఆనంద, మురళీకృష్ణ, దువ్వారపు జయరాం, తదితరులు పాల్గొన్నారు.