ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆక్రమణలు తొలగించే పనిలో రెవెన్యూ సిబ్బంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 19, 2023, 10:59 AM

నూజివీడు రెవిన్యూ డివిజన్ పరిధిలో గల లింగపాలెం మండలంలోని ఆశన్నగూడెం గ్రామంలో రహదారుల మార్జిన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించే పనులను గురువారం రెవెన్యూ , సచివాలయ సిబ్బంది మొదలుపెట్టారు. ఆక్రమణల వలన సొంత ఇళ్లకు వెళ్లే దారిలేకుండా ఉందని స్పందన లో ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది, సచివాలయ సిబ్బంది వీటిని తొలగించే పనిలో పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగిస్తామని మండలస్థాయి అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com